NLR: చేజర్ల మండలంలోని యనమదలలో మంగళవారం యూరియా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి హిమబిందు మాట్లాడుతూ.. మండలంలో యూరియా సరఫరాకు ఎలాంటి కొరతలేదని తెలిపారు. రైతులు తమ పంట అవసరాలకు తగినంతగా యూరియాను వినియోగించుకోవచ్చని సూచించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం సమృద్ధిగా ఎరువులను అందుబాటులో ఉంచిందని ఆమె చెప్పారు.