NLG: యువత మత్తు పదార్థాల బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నల్గొండ పట్టణంలోని గౌతమి జూనియర్ కళాశాలలో పోలీస్, జిల్లా సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘మాదకద్రవ్యాల దుర్వినియోగం’ అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం ఆమె మాట్లాడారు.