KDP: పెండ్లిమర్రి మండలం వెల్లటూరులో మంగళవారం పోలీసుల మధ్య గొడవ జరిగింది. సీఎం చంద్రబాబు పర్యటన బుధవారం జరగనుంది. ఈ క్రమంలో బందోబస్తుగా వచ్చిన ఏఎస్ఐ, కానిస్టేబుల్ ఓ హోటల్ వద్ద మాట మాట పెరిగి గొడవకు దారితీసింది. మీరెంత అంటే మీరెంత అంటూ రెండు గ్రూపులుగా విడిపోయిన పోలీసులు నడిరోడ్డుపై కలబడ్డారు. స్థానికులు, తోటి పోలీసులు వారికి సర్ది చెప్పారు.