ADB: జిల్లా వ్యాప్తంగా 30% ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా జిల్లాలో మొట్టమొదటిసారిగా రోడ్ సేఫ్టీ క్లబ్ అనే కార్యక్రమాన్ని జిల్లా SP అఖిల్ మహాజన్ మంగళవారం ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహన నియమ నిబంధనలు పాటించేలా రోడ్డు నిబంధనలు పాటించాలని సూచించారు. క్షతగాత్రునికి హృదయ స్పందన, ఊపిరి లేని సందర్భంలో CPR చేసి బ్రతికించే శిక్షణను అందించారు.