జిల్లా పోలీసు శాఖలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బిఎస్ఎన్ మూర్తి ఇటీవల కాకినాడలో జరిగిన 14వ, ఏపీ రాష్ట్ర తైక్వాండో పూమ్స్ 2025 పోటీల్లో బంగారు పతకం సాధించారు. త్వరలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ మంగళవారం తెలిపారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. మూర్తి మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.