NZB: కవి, రచయిత డాక్టర్ అందెశ్రీ సంస్మరణ సభను మంగళవారం సాయంత్రం జిల్లా గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్కార భారతి ప్రతినిధులు, ఇందూరు కవులు, రచయితలు అందెశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమానికి అందెశ్రీ తన రచనల ద్వారా ఊపిరి పోశారని వక్తలు ఈ సందర్భంగా పేర్కొన్నారు.