VZM: మద్యం సేవించి వాహనం నడుపుతున్న వ్యక్తికి సాలూరు మొదటి శ్రేణి జడ్జి హర్షవర్ధన్ 14 రోజులు జైలుశిక్ష విధించినట్లు ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ మంగళవారం తెలిపారు. ఎస్పీ వివరాల మేరకు సాలూరు మండలం దత్తివలస గ్రామానికి చెందిన గంటా వెంకటేష్ ఈనెల 17న ,రామభద్రాపురం పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా మద్యం తాగి పట్టుబడినట్లు చెప్పారు.