KRNL: డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని కర్నూలు ట్రాఫిక్ CI మన్సూరుద్దీన్ తెలిపారు. ఈ ప్రత్యేక డ్రైవ్లో పట్టుబడ్డ 23 మందిని కోర్టులో హాజరు పరిచామన్నారు. కేసు విచారణలో భాగంగా JFCM కోర్టు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ. 2.30 లక్షల జరిమానా విధించినట్లు ఆయన పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఆయన సూచించారు.