ప్రతి రోజూ 30 నిమిషాలు పలు వ్యాయామాలు చేస్తే ఎముకలు దృఢంగా, గుండె ఆరోగ్యంగా, మనసు సంతోషంగా ఉంటుంది. నీటిలో చేసే వ్యాయామాలకు ఎముకలపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. స్విమ్మింగ్ మొత్తం శరీరంలోని కండరాలను పని చేయిస్తుంది. హృదయ స్పందనను నియంత్రిస్తుంది. శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది. మోకాళ్లు, వెన్నెముక నొప్పి ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన వ్యాయామం.