NRML: మామడ మండలంలోని కొరిటికల్ ఎక్స్ రోడ్డు దగ్గర మంగళవారం రాత్రి ఆటో–బైక్ ఢీకొని ఇద్దరు యువకులు గాయపడ్డారు. భరత్ చేయి తెగిపోగా, తుకారాం కాలు తీవ్రంగా దెబ్బతింది. కూలి పనుల కోసం మహారాష్ట్ర నుంచి వచ్చిన వీరు నిర్మల్‌కు వెళ్తుండగా ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఈఎంటి శేఖర్ పైలట్ ప్రథమ చికిత్స చేసి ఇద్దరినీ నిర్మల్ హాస్పిటల్‌కు తరలించారు.