CTR: చిత్తూరు నగర మేయరు దంపతులు కఠారి అనురాధ, మోహన్ హత్య కేసు విచారణ సమయంలో 14 మంది న్యాయస్థానంలో తప్పుడు సాక్ష్యం ఇచ్చారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి వీరందరినీ ఎందుకు ప్రాసిక్యూట్ చేయకూడదో చెప్ప లంటూ షోకాజ్ నోటీసులు ఇవ్వాలని 1వ పట్టణ సీఐను ఆదేశించారు. కోర్టు ఆదేశాలతో 12 మంది నగరపాలక సంస్థ ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు.