అనంతపురం: రాయదుర్గం పట్టణంలోని కొండ పరిసర ప్రాంతాలను బుధవారం పొగ మంచు కమ్మేసింది. దీంతో ఒక్కసారిగా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకోవడంతో చలి గాలుల తీవ్రత పెరిగింది. చలి గాలుల తీవ్రతకు ప్రజలు వణుకుతూ ఇళ్లకే పరిమితమయ్యారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.