TG: హైదరాబాద్లో రెండో రోజు ఐటీ అధికారుల దాడులు కొనసాగనున్నాయి. పిస్తా హౌస్, షాగౌస్, మోహఫిల్లో నిన్న అధికారులు సోదాలు చేసి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ పిస్తా హౌస్ యజమాని ఇంట్లో కూడా సోదాలు చేశారు. నగదు, బంగారం సీజ్ చేశారు. ఈ క్రమంలో నేడు బ్యాంక్ ఖాతాలు, లాకర్లను ఐటీ అధికారులు పరిశీలించనున్నారు.