ప్రకాశం: పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లి సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న ఎద్దుల అరకలను ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. వారిని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు దోర్నాల మండలం యడవల్లికి చెందిన నల్లబోతుల శివగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.