TG: తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఇవాళ వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు. పీఏ చిన్న అప్పన్న సమాధానాల ఆధారంగా ప్రశ్నించనున్నారు. ప్రీమియర్ అగ్రిఫుడ్స్ నుంచి అప్పన్న రూ.50 లక్షలు తీసుకున్నారని నిర్ధారణ కాగా.. వైవీ సుబ్బారెడ్డి దంపతుల లావాదేవీల వివరాలు ఇవ్వాలని యాక్సిస్ బ్యాంకు అధికారులను సిట్ కోరింది.