NLG: సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లాలో చిత్తడి నేలల గుర్తింపు కార్యక్రమాన్ని శనివారం నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా చిత్తడి నేలల సంరక్షణ, నిర్వహణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో చిత్తడి నేలల గుర్తింపును పూర్తి చేయాలన్నారు.