NDL: అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ లాంచింగ్ కార్యక్రమానికి బేతంచెర్ల మండలానికి రాష్ట్ర ఆర్థికశాఖా మంత్రి పయ్యావుల కేశవ్ హాజరవుతున్నట్లు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి మంగళవారం తెలిపారు. మధ్యాహ్నం 1.00 గంటకు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యకమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు.