AP: పుట్టపర్తిలో సత్య సాయిబాబా శత జయంత్యుత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 9.2 కిలోల బంగారంతో తయారు చేసిన సత్యసాయి విగ్రహాన్ని వెండి రథంలో ఊరేగించారు. భక్తజన సంద్రమైన ప్రశాంతి నిలయంలో ‘సురంజలి’ పేరుతో సంగీత కార్యక్రమం జరిగింది. ఇవాళ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యరాయ్ తదితరులు ఉత్సవాల్లో పాల్గొననున్నారు.