AP: YCP రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డికి న్యాయాధికారి బెయిల్ మంజూరు చేశారు. అంతకుముందు ఆయనకు తాడిపత్రి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయింది. కాగా TTD మాజీ AVSO సతీష్ కుమార్ హత్య కేసులో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో కారుమూరిని అరెస్ట్ చేశారు.