KRNL: విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, బాగా చదువుకొని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోవాలని ఎక్సైజ్ CI భార్గవరెడ్డి సూచించారు. ప్రధాని ప్రవేశపెట్టిన నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా కోసిగిలోని బాలుర హైస్కూల్లో మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మత్తుపదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలను విద్యార్థులకు వివరించారు.