VZM: దళితులు, గిరిజనులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కోట అప్పన్న కేంద్ర ప్రభుత్వాని డిమాండ్ చేశారు. ఈ మేరకు CPI ఆధ్వర్యంలో బొబ్బిలి పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో BJP అధికారంలోకి వచ్చిత తర్వాత దేశ వ్యాప్తంగా దళితులు, గిరిజనులపై దాడులు అధికంగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.