PDPL: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా అధికారులు, సిబ్బంది మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. అదనపు కలెక్టర్, కమిషనర్ జే. అరుణశ్రీ నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. గోదావరిఖని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు కూడా ప్రతిజ్ఞలో పాల్గొన్నారు.