SS: పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ప్రశాంతి నిలయం వెస్ట్ గేట్ వద్ద భారీగా వసతి గృహాలను ఏర్పాటు చేశారు. భక్తులకు ఉచితంగా భోజనాలు, టిఫిన్లు, టీ అందించే ఏర్పాట్లు కూడా ఇక్కడ పూర్తయ్యాయి. వసతి, భోజనం గురించి భయపడాల్సిన అవసరం లేదని, అన్ని ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు భక్తులకు తెలియజేశారు.