TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి హంస వాహనసేవ వైభవంగా జరిగింది. అమ్మవారు హంస వాహనంపై వీణ ధరించి చదువుల తల్లి సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు.