KRNL: జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హాల్ టికెట్లు విడుదల చేసినట్లు ప్రిన్సిపల్ పద్మావతి మంగళవారం తెలిపారు. వచ్చే నెల 13న ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. హాల్ టికెట్లను నేటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని, ఏవైనా సందేహాలుంటే ఈ నంబరును 085212-29454 సంప్రదించాలన్నారు.