SS: సత్యసాయి బాబా 100వ శత జయంతి ఉత్సవాలకు విచ్చేసే భక్తుల సౌకర్యార్థం రైల్వే స్టేషన్ నుంచి పుట్టపర్తి లోపలికి ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. రైలు దిగిన వెంటనే బస్సులు స్టేషన్ ముందరే అందుబాటులో ఉంటాయి. వెస్ట్ గేట్ వైపు, చిత్రావతి నది వైపు వెళ్లే బస్సులు సిద్ధంగా ఉన్నాయి. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు.