KNR: జమ్మికుంట మండలం పాపక్కపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి పోరెడ్డి నరేందర్ రెడ్డిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం శాలువాతో సత్కరించి అభినందించారు. ఇటీవల మైనర్ బాలికను వివాహం చేసుకున్న వారిపై నరేందర్ రెడ్డి ధైర్యంగా పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలల హక్కుల పరిరక్షణలో ఆయన చూపిన ధైర్యసాహసాలకు అభినందించారు.