MDK: తూప్రాన్ పట్టణంలో 145 గ్రాముల గంజాయి పట్టుకున్నట్టు తూప్రాన్ ఎస్సై శివానందం తెలిపారు. శివంపేట మండలం లచ్చిరెడ్డిగూడెంకు చెందిన దుగ్గూరి శ్రవణ్ కుమార్ గంజాయి అమ్మకం చేస్తున్నట్లు సమాచారం రాగా దాడులు చేసినట్లు తెలిపారు. అతడి వద్ద145 గ్రాముల గంజాయి, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నాందేడ్‌కు చెందిన శివ గంజాయి సరఫరా చేస్తున్నారన్నారు.