ASF: పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను అదనపు కలెక్టర్ దీపక్ తివారి బుధవారం పరిశీలించారు. నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని, ఇప్పటివరకు మొదలు పెట్టని లబ్ధిదారులు వెంటనే పనులు ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గజానంద్, హౌసింగ్ పీడీ, హౌసింగ్ ఏఈ తదితరులు పాల్గొన్నారు.