AKP: బల్క్ డ్రగ్ పార్క్ సమస్యను వైసీపీ అధినేత జగన్ దృష్టికి తీసుకువెళ్లినట్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. బుధవారం నక్కపల్లి వచ్చిన అమర్నాథ్ను పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో మత్స్యకారులు కలిశారు. మత్స్యకారులకు వైసీపీ అండగా నిలుస్తుందని జగన్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.