NLR: బుచ్చిరెడ్డిపాలెంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇందులలో భాగంగా రూ.2.25 కోట్లతో మలిదేవి కాలువ వద్ద ఫైర్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. 2.25 కోట్ల రూపాయలతో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నో ఏళ్ల బుచ్చి వాసుల కల నేడు నెరవేరుతుందని తెలిపారు.