NLG: నాటుసారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లాన్ని తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు దేవరకొండ ఎక్సైజ్ సీఐ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు వాహనంలో బెల్లం తరలిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం అందడంతో చెర్కుపల్లి గ్రామ సమీపంలో దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు తెలిపారు. ఈ తనిఖీలో 2400 కిలోల నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.