SRCL: ఎల్లారెడ్డి పేటలో ముగ్గురు యువకులు గంజాయి తరలిస్తుండగా పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని సీఐ శ్రీనివాస్ తెలిపారు. మండలానికి చెందిన మంద ప్రశాంత్, బుర్కా సాయి, గనగోని అరవింద్ కరీంనగర్లోని ఓ వ్యక్తి వద్ద గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తూ పట్టుపడ్డారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా 150 గ్రాముల గంజాయి లభించిందన్నారు.