CTR: సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నేటి నుంచి కుప్పంలో పర్యటించనున్నారు. 4 రోజులు పాటు నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల్లో నారా భువనేశ్వరి పర్యటిస్తారు. ఇటీవల శాంతిపురం (M) శివపురం వద్ద నూతనంగా నిర్మించిన ఇంట్లోనే ఉంటూ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు భువనేశ్వరి పర్యటన ఖరారైంది. భువనేశ్వరి పర్యటనకు టీడీపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు.