E.G: కడియం మండలం కడియం గ్రామంలోని శెట్టిబలిజ పేటలో YCP రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా వైసీపీ చేపడుతున్న కోటి సంతకాల కార్యక్రమం జరిగింది. మంగళవారం రాత్రి ఆ ఏరియాలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటుపరం చేయడం వల్ల కలిగే నష్టాలను గిరిజాల బాబు ప్రజలకు వివరించి సంతకాల సేకరణ చేపట్టారు.