AP: విజయవాడలోని పెనమలూరులో ఆక్టోపస్ బృందాల తనిఖీలు ముగిశాయి. తనిఖీల్లో భాగంగా ఆటోనగర్‌లోని ఓ బిల్డింగ్ మొత్తాన్ని ఖాళీ చేయించారు. మొత్తం 27 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిని ఆక్టోపస్, టాస్క్‌ఫోర్స్ ఆఫీసుకు తరలించారు. అరెస్టైన వారంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా గుర్తించారు.