MBNR: నవాబ్ పేట మండలం ఎన్మనగండ్లలో తాగునీటి సమస్యపై మహిళలు బిందెలతో రోడ్డుపై ధర్నా నిర్వహించారు. పది రోజుల నుంచి మిషన్ భగీరథ నీరు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయర్లలో నీరు ఉన్నప్పటికీ సరఫరాలో నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారని ప్రజలు అధికారులను, ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు.