ADB: గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మండల వైద్య విస్తరణ అధికారి జ్ఞానేశ్వర్ అన్నారు. భీంపూర్ మండలంలోని అండర్ బంద్ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, రక్త పరీక్షలు నిర్వహించి మందులను అందజేసినట్లు పేర్కొన్నారు. రక్తహీనత గల మహిళలు రోజువారి ఆహారంలో ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలని సూచించారు.