VZM: ఎస్.కోటలో శ్రీ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ గౌరీ పరమేశ్వరుల మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని ఆమె స్వయంగా వడ్డించారు.