KKD: సైబర్ నేరాల పట్ల ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని పెద్దాపురం సీఐ విజయ్ శంకర్ పేర్కొన్నారు. డీఎస్పీ శ్రీహరి రాజు ఆధ్వర్యంలో మంగళవారం పెద్దాపురం సాగర్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్ధిని, విద్యార్ధులకు సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మాదక ద్రవ్యాల దుస్ప్రవాలు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వంటి వాటిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.