AP: PMAY పథకం కింద రూ.2.50 లక్షలను ప్రభుత్వం అందిస్తోందని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అర్హత కలిగిన ప్రతిఒక్కరూ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. తద్వారా సొంతింటి నిర్మాణం చేసుకోవాలనుకునేవారు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం పొందాలన్నారు. నవంబర్ 30లోపు గ్రామ, సచివాలయాల్లో వివరాలను నమోదు చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.