NRPT: జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద మంగళవారం ఎస్సై వెంకటేశ్వర్లు వాహనాలను తనిఖీ చేశారు. కానుకుర్తి నుంచి ఉట్కూరుకు పత్తి తీసేందుకు వెళ్తున్న మూడు బొలెరో వాహనాల్లో పరిమితికి మించి 40 నుంచి 50 మంది కూలీలు ఉండటం గమనించారు. డ్రైవర్లపై కేసు నమోదు చేసి, వారికి హెచ్చరికలు జారీ చేశారు. అనంతరం కూలీలకు, డ్రైవర్లకు ప్రయాణ నిబంధనలపై అవగాహన కల్పించారు.