KMM: హైదరాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలను మంగళవారం రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన రాయలను సీఎం, డిప్యూటీ సీఎం అభినందించారు.