VKB: కుల్కచర్ల, పుట్టపాడు గ్రామంలోని పాఠశాల్లో మంగళవారం నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో ఎంఈఓ అభిబ్ హమద్ మాట్లాడారు. మహిళా క్రికెట్ జట్టు ప్రపంచకప్ సాధించిన స్ఫూర్తితో ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపాలని సూచించారు. ఉపాధ్యాయులు సమర్థవంతంగా విద్యా బోధనలో మెలకువలు పాటించాలని సూచించారు.