MLG: జిల్లాలోని 185 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటివరకు 7,131.080 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి సేకరించినట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. 17 శాతం తేమ ఉన్న 3,775.120 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు తరలించామన్నారు. రైతులకు రూ.1.82 కోట్లు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేశామని కలెక్టర్ పేర్కొన్నారు.