AP: వైకుంఠ ఏకాదశిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 30 నుంచి 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు తెలిపింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది. మొత్తం 182 గంటల దర్శన సమయంలో.. 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయిస్తామని తెలిపింది. దీంతో సామాన్య భక్తులకు మేలు జరుగుతుందని వివరించింది. టీటీడీ పాలక మండలి సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.