RR: షాద్ నగర్ నియోజకవర్గం ఎల్లంపల్లిలో రాజశేఖర్ హత్య విషయంలో రాజకీయపార్టీల వైఖరిని MRPS తీవ్రంగా ఖండిస్తుందని MRPS జిల్లా అధ్యక్షులు పెంటనోళ్ల నరసింహ అన్నారు. వారు మాట్లాడుతూ.. దళితులను హత్య చేసినా రాజకీయ పార్టీలకు పట్టదా? ఊరేగింపుల కోసం మాత్రమే దళితులు కావాలా అని ప్రశ్నించారు. మృతి చెంది ఇన్ని రోజులు అవుతున్న కనీసం పరామర్శించలేదని విమర్శించారు.