W.G: పాలకొల్లులోని MMKNM మున్సిపల్ హైస్కూల్లో జరుగుతున్న ‘టీచ్ టూల్’ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను మంగళవారం ఎంఈవో గుమ్మళ్ల వీరాస్వామి తనిఖీ చేశారు. శిక్షణలో ఉన్న ఉపాధ్యాయుల హాజరును ఆయన పరిశీలించారు. ఈ శిక్షణ ద్వారా బోధనా పద్ధతులను మెరుగుపరుచుకొని విద్యార్థుల నుంచి అత్యుత్తమ ఫలితాలు రాబట్టాలని సూచించారు. ప్రతిభ కనబరచిన ఉపాధ్యాయులకు బహుమతులు అందజేశారు.