GDWL: ప్రస్తుత శీతాకాలం నేపథ్యంలో జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ శ్రీనివాసరావు ప్రజలకు మంగళవారం పలు సూచనలు చేశారు. పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు వాహనాల వేగం తగ్గించాలని, హై బీమ్ లైట్లకు బదులు ఫాగ్ లైట్లు ఉపయోగించాలని కోరారు. వాహనాలకు ముందు, వెనుక లైట్లు పనిచేస్తున్నాయో లేదో చూసుకోవాలని, సురక్షిత దూరం పాటిస్తూ ఆకస్మాత్తుగా బ్రేకులు వేయడం మానుకోవాలని ఆయన తెలిపారు.