KMR: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం డ్రగ్స్‌ను నివారిద్దామంటూ ప్రతిజ్ఞ చేశారు. GGH సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.